HomeTelugu Trendingమహేష్‌ సినిమాలో రాజమౌళి విలన్‌.!

మహేష్‌ సినిమాలో రాజమౌళి విలన్‌.!

1 9టాలీవుడ్‌ హీరో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా పరశురామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా సంగతి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిట్‌ ‘సర్కార్ వారి పాట’ ప్రకటించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. లవ్ స్టోరీస్ ను తీసే పరశురామ్ ఈసారి అనూహ్యంగా ఏ వెరైటీ కాన్సెప్ట్ తో మహేష్ బాబును చూపించబోతున్నాడు. బ్యాంక్ మోసాలకు సంబంధించిన కథ అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో హీరోకు తగిన విలన్ కోసం పరశురామ్ అండ్ టీమ్ చాలా ట్రై చేసింది.

మొదట ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో, దర్శకుడు ఉపేంద్ర ను తీసుకోవాలని అనుకుందట. కానీ, ఉపేంద్ర అప్పటికే పూర్తి చేయాల్సిన సినిమాలు చాలా ఉండటంతో ఈ సినిమాను తిరస్కరించినట్లు తెలుస్తుంది. అయితే, ఈగ సినిమాతో తెలుగులో విలన్ మంచి పేరు తెచ్చుకున్నాడు సుదీప్. సుదీప్‌కు కథ వినిపించగా వెంటనే ఒకే చెప్పాడట. తన డేట్స్ ఖాళీగా లేకున్నా సర్దుబాటు చేసుకొని 30 రోజులపాటు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ 30 రోజుల్లోనే తన వెర్షన్ కంప్లీట్ చేయాలని కండిషన్ పెట్టాడట. సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్న సుదీప్ కు భారీ మొత్తం ముట్టజేబుతున్నట్టు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu