HomeTelugu TrendingSudheer 16:తలకిందులుగా సుధీర్‌ బాబు......

Sudheer 16:తలకిందులుగా సుధీర్‌ బాబు……

Sudheer Babu's Pre-look From His Action Thriller Excites Fans

యంగ్‌ హీరో సుధీర్‌బాబు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవలె శ్రీదేవి సోడా సెంటర్‌ సినిమాతో హిట్‌ అందుకున్న సుధీర్‌బాబు కృతిశెట్టితో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు సైన్‌ చేశాడు. దానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ను సుధీర్‌ బాబు బర్త్‌డే సందర్భంగా విడుదల చేశారు. ఇదే కాకుండా భవ్య క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో సుధీర్ తన 16వ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ పోస్టర్‌లో సుధీర్‌ బాబు తలికిందులుగా పుష్‌ అప్స్‌ చేస్తూ ఆకట్టుకున్నాడు. పోస్టర్‌ ద్వారా సూపర్ ఫిట్‌గా ఉన్న సుధీర్‌బాబుకు ‘హ్యాపీ బర్త్‌డే నైట్రో స్టార్‌’ అని విష్ చేశారు. ఇంకా పేరు పెట్టని చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తుండగా.. ఫీల్‌గుడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందించే ప్రముఖ నిర్మాత వీ ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu