ఫైనల్ గా హీరో డబ్బులిచ్చేశాడు!

ఇండస్ట్రీలో ఒక హీరోతో అనుకున్న సినిమాలు మరొక హీరోతో చేయడం కామన్. స్క్రిప్ట్ ఒక హీరోకి వినిపించి ఆయనకు నచ్చినా.. ఒక్కో సారి మధ్యలోనే ఆ ప్రాజెక్ట్స్ ఆగిపోతుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు చెప్పలేరు.

గతంలో దర్శకుడు లింగుస్వామి, శింబుతో సినిమా చేయడానికి ఆయనకు అడ్వాన్స్ గా కోటి రూపాయలను
ముట్టజెప్పాడు. ఆ తరువాత కొన్ని కారణాల వలన లింగుస్వామి తన నిర్ణయం మార్చుకొని అడ్వాన్స్ తిరిగి ఇవ్వవలసిందిగా శింబుని కోరాడు. దానికి శింబు అంగీకరించలేదు.

గత కొన్ని రోజులుగా ఈ విషయమై వీరిద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. తాజాగా ఈ సమస్యకు పరిష్కారం లభించింది. శింబు నటించిన తాజా చిత్రం ‘అచ్చం ఎన్మదు మద మాయిడ’ (సాహసం శ్వాసగా సాగిపో) విడుదలవుతోన్న సమయంలో లింగుస్వామి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను సంప్రదించాడు. సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి రావడంతో.. శింబు తను అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బుని లింగుస్వామికి తిరిగి ఇచ్చేశాడు.