HomeTelugu Trendingక్షమించు సుశాంత్.. సన్నీలియోన్‌ భావోద్వేగపూరిత లేఖ

క్షమించు సుశాంత్.. సన్నీలియోన్‌ భావోద్వేగపూరిత లేఖ

3aబాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌‌ ఆత్మహత్యపై ఫోర్న్‌ స్టార్‌ సన్నీలియోన్‌ స్పందించింది. ఈ మేరకు సోమవారం ట్విటర్‌లో భావోద్వేగపూరిత లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో ‘సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడని వినగానే చాలా బాధపడ్డా అని తెలిపింది. ఏం అనాలో.. ఏం రాయాలో అర్థంకాలేదు. ఎందుకంటే ఇంకొకరి గురించి ఇంతలా బాధపడటం నేను ఇది వరకు ఎరుగను.( దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నా). డిప్రెషన్‌ను ఎలా అధిగమించాలో, పాజిటివ్‌గా ఎలా ఉండాలో చాలా మంది ఇతరులకు సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ, మంచిని అన్వేషించటానికి, సంతోషంగా ఉండటానికి కొన్నిసార్లు చిరునవ్వు చిందించటం కష్టం.. నవ్వటం అసాధ్యం. అందరికీ ఇలాంటి భావాలు ఉంటాయి. కానీ కొంతమంది వీటినుంచి పక్కకు వెళ్లలేరు.

అన్నీ మర్చిపోయి ముందుకు సాగలేరు. కుటుంబం, మిత్రుల నుంచి సహాయం లేదా వృత్తిపరమైన సహాయం అవసరమైన వారికి.. పాజిటివ్‌గా ఉండండి అని చెప్పటం అంత మంచిది కాదు. క్షమించు సుశాంత్‌! ఈ ప్రపంచంపై పూర్తిగా నమ్మకం కోల్పోయి నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకున్నావు. చావులోనైనా నువ్వు కోరుకున్న ఆనందాన్ని పొందావని అనుకుంటున్నాను. నువ్వు లేవన్న సత్యం నీ వారిని ఇక ఎప్పటికీ వేధిస్తూనే ఉంటుంది. నీ కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. నీ ఆత్మకు శాంతి కలుగుగాక’ అని పేర్కొంది సన్నీలియోన్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!