వైరల్‌ అవుతున్న సన్నీలియోన్‌ ఫొటో

ఫోర్న్‌ స్టార్‌గా తన ప్రస్థానాని మొదలు పెట్టిన సన్నీలియోన్. ఆ చిత్రాల నుంచి ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ కు ఎదిగింది. అంతేకాదు, సన్నీ వివిధ రకాల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కు వచ్చిన కొత్తల్లో ఐటెం సాంగ్స్ కు మాత్రమే పరిమితమైన సన్నీ, ఇప్పుడు అన్నిరకాల సినిమాలు చేస్తూ బిజీ అయింది. మరోవైపు సొంతంగా స్టార్ స్టక్ అనే పేరుతో సౌందర్య ఉత్పత్తులను ప్రారంభించి వాటిని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కల్పిస్తూ.. బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న సన్నీలియోన్ సౌత్ లో వీరమాదేవి అనే పేరుతో ఓ చారిత్రాత్మక చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్నది. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారట. ఈ భాషలకు చెందిన నిర్మాతలు ఈ సినిమాలో పాలుపంచుకోవడంతో దీనికి ప్రధాన్యత ఏర్పడింది.

ఇదిలా ఉంటె, ఇటీవలే సన్నీలియోన్ ఓ మ్యాగజైన్ కోసం పోజులు ఇచ్చింది. కపిల్ కిల్ నాని అనే ఫోటో గ్రాఫర్ ఈ ఫోటోలను తీశారు. బ్లాక్ కలర్ నిక్కర్, కాఫీ కలర్ టైట్ ఫిట్ టాప్, ఆరెంజ్ కలర్ చున్నీ, బ్లాక్ కలర్ మోడ్రన్ సన్ గ్లాస్ తో.. పోజులు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.