Homeతెలుగు Newsరాందేవ్‌ బాబాకు కోర్టు నోటీసులు

రాందేవ్‌ బాబాకు కోర్టు నోటీసులు

యోగా గురు రాందేవ్‌ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. రాందేవ్‌ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో రాందేవ్‌ బాబాకు నోటీసులు పంపినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.

10 18

జుగ్గర్‌నౌట్‌ బుక్స్‌ అనే పబ్లిషర్‌ “గాడ్‌మ్యాన్‌ టు టైకూన్” అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్‌ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను, కీర్తిప్రతిష్ఠలను దెబ్బతీసే విధంగా సమాచారం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆ పుస్తకం అమ్మకాలను, ప్రచురణను నిలిపేయాలని తీర్పు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆ పబ్లిషర్‌ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu