HomeTelugu Big Storiesసుశాంత్‌ చాలా టాలెంటెడ్.. నెపోటిజంపై సురేష్ బాబు కామెంట్స్

సుశాంత్‌ చాలా టాలెంటెడ్.. నెపోటిజంపై సురేష్ బాబు కామెంట్స్

8 27
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత ఇండస్ట్రీలో ఉన్న నెపోటిజం (బంధుప్రీతి) పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కూడా బంధుప్రీతి ఎక్కువగానే ఉందనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టాలీవుడ్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సురేష్‌ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో నెపోటిజం గురించి తాను మాట్లాడను కానీ.. ఎవరికైనా టాలెంట్ ఉంటేనే ఎదుగుతారని చెప్పాడు.

ఇండస్ట్రీలో నెపోటిజం అనేది ఉంటే ఉండొచ్చని.. అయితే టాలెంట్ లేకపోతే నెపోటిజం వారిని కాపాడలేదని ఆయన అన్నారు. ఎవరైనా సరే ఎవరికి వారు నిరూపించుకోవాల్సిందేనని చెప్పారు. పెద్దపెద్ద స్టార్లు కూడా వరుసగా రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయి.. రెండు, మూడేళ్లు ఖాళీగా కూర్చున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయని… వాటిని దాటితేనే విజయం వస్తుందనే విషయం గుర్తించుకోవాలని చెప్పాడు సురేష్ బాబు. స్టార్ హీరోలు, డైరెక్టర్ల కుటుంబాల్లో హీరోలుగా ట్రై చేసి ఫెయిల్ అయినవారు ఎంతోమంది ఉన్నారని అన్నారు.

తన కుమారుడు అభిరామ్‌కు తాను హీరోగా అవకాశం మాత్రమే ఇవ్వగలనని… కానీ, హీరోగా అతనే ఎదగాల్సి ఉంటుందని చెప్పారు. ఎవరినైనా బలవంతంగా హీరోగా చేయలేమని… ప్రేక్షకులకు నచ్చితేనే హీరో అవుతాడని ఆయన అన్నారు. తెలుగు విషయానికి వస్తే… రవితేజ, నాని, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ వీరంతా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే స్టార్స్ గా ఎదిగారని చెప్పారు. బాలీవుడ్ హీరో సుశాంత్ విషయానికి వస్తే ఆయన చాలా టాలెంటెడ్.. చిన్న వయసులోనే ఎంతో సాధించాడు.. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడని చెప్పాడు సురేష్ బాబు. సూపర్ స్టార్ కావాల్సిన వాడు తొందరపడ్డాడని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సురేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!