మహేష్ అంత రిస్క్ తీసుకున్నాడా..?

మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట. అవి చాలా రిస్కీతో కూడుకున్న ఫైట్స్ అని తెలుస్తోంది. వాటిని చేయడానికి డూప్స్ కూడా ఆలోచించారట. కానీ మహేష్ మాత్రం డూప్స్ అవసరం లేదని చెప్పి ఆ ఫైట్స్ ను తనే చేసి హీరోయిజాన్ని ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళినట్లు సమాచారం.

నిజానికి మహేష్ అంత రిస్క్ తీసుకొని పని చేస్తాడని ఎవరూ ఊహించలేదట. ఆయన చేసిన పనిని చిత్రబృందం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఈ రియల్ ఫైట్స్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయని నమ్మకంగా చెబుతున్నారు. మహేష్ సరసన రకుల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని జూన్ 23న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.