HomeTelugu Trendingథియేటర్స్‌లో సుశాంత్‌ చివరి సినిమా

థియేటర్స్‌లో సుశాంత్‌ చివరి సినిమా

Sushant last film to be relబాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఈ సినిమా. దిల్ బేచారా ట్రైలర్ ప్రపంచంలో అత్యధిక లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓటీటీలో కూడా అదే రేంజ్ లో విజయం సాధించింది. రికార్డుల మోతమోగించింది. హాలీవుడ్ చిత్రాలకే సాధ్యమైన రికార్డును దిల్ బేచారా అవలీలగా అందుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఈ చిత్రం ఏకంగా 95 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుందని హాట్ స్టార్ అధికారికంగా పేర్కొంది.ఇప్పటి వరకు ఓటీటీ చరిత్రలో ఏ సినిమా కాని వెబ్ సిరీస్ కాని ఈ స్థాయిలో వ్యూస్ ను దక్కించుకోలేదు. రాబోయే పదేళ్ల వరకు దిల్ బేచారా రికార్డు పదిలంగా ఉంటుందని సుశాంత్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సుశాంత్ చివరి సినిమాను థియేటర్లలో చూడలేక పోయాం అంటూ ఆయన అభిమానులు చాలా బాధ పడ్డారు. ఈ నేపథ్యం లో దిల్ బేచారా సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఇండియాలో కాదు ఆస్ట్రేలియాలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. వచ్చే నెల 8వ తారీకున ఆస్ట్రేలియాలోని పలు ముఖ్య మల్టీప్లెక్స్ లో స్క్రీనింగ్ కు రెడీ అయ్యింది. దిల్ బెచారా మాత్రమే కాకుండా మరో రెండు హిందీ సినిమాలను కూడా ఆస్ట్రేలియాలో విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!