బుల్లితెరపై మరో హీరోయిన్!

‘కొత్తబంగారులోకం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి శ్వేతబసు ప్రసాద్, తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామకు తరువాత చెప్పుకోదగిన హిట్టు సినిమా పడలేదు. దీంతో హిందీ సినిమాలపై దృష్టి పెడుతూ అవకాశాలు సంపాదించుకుంటోంది. అలానే మరో వైపు హిందీ సీరియల్స్ కూడా నటిస్తోంది. అలా ఆమె తాజాగా ‘చంద్రనందిని’గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధపడుతోంది. 

ఈ సీరియల్ లో ఆమె చంద్రగుప్త మౌర్యుడి భార్య పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర తనకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకతో ఉంది. అలానే తెలుగులో కూడా సీరియల్స్ లో అవకాశం వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. హైదరాబాద్ లో బ్రోతల్ కేసులో పోలీసులు శ్వేతను అరెస్ట్ చేసిన తరువాత ఆమెకు ఇంక అవకాశాలు రావని అనుకున్నారు. కానీ హిందీలో ఓ సినిమా, సీరియల్స్ తో బిజీగా గడుపుతోంది ఈ భామ.