‘డిజె’ మూడు రోజుల కలెక్షన్స్!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. బన్నీ కెరీర్ లో ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ ఈ సినిమా రాబట్టింది. విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి తన సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ భారీగా వసూలు చేసింది. ఏపీ, తెలంగాణలలో మొదటిరోజు 18.5 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు 8.05 కోట్లు వసూలు చేసింది. 
ఇక ఆదివారం తొమ్మిది కోట్లకు పైనే వసూలు చేసింది. దీన్ని బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 35 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సోమవారం కూడా సెలవు దినం కావడం ‘డిజె’కు బాగా కలిసొస్తోంది. కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నైజాంలో మూడు రోజులకు గానూ 11.59 కోట్లు షేర్ సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది.