మెహ్రీన్ మరో స్టార్ హీరోయిన్ అవుతుందా..?

‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన బ్యూటీ మెహ్రీన్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టడంతో దర్శకనిర్మాతలు మెహ్రీన్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గ్లామర్ పరంగా.. నటన పరంగా అమ్మడుకి మంచి మార్కులు పడడంతో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

ఇప్పటికే రవితేజ, సాయి ధరం తేజ్, శర్వానంద్, సందీప్ కిషన్ సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈ నాలుగు సినిమాల్లో ఏ రెండు సినిమాలు హిట్ అయినా.. మెహ్రీన్ కెరీర్ కు బాగా ప్లస్ అవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత చాలా ఉంది. ఈ నేపధ్యంలో మెహ్రీన్ నటించే సినిమాలు గనుక హిట్ అయితే రానున్న రోజుల్లో ఆమె జోరు పెరగడం ఖాయం. ఈ తెలుగు సినిమాలతో పాటు మరో రెండు హిందీ సినిమాల్లో కూడా మెహ్రీన్ నటిస్తుండడం విశేషం.