‘సైరా’ లక్ష్మి(తమన్నా) ఫస్ట్‌లుక్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.. రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సౌత్‌ టాప్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. తమన్నా మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమన్నా పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మిల్కీ బ్యూటీకి బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది.

సినిమాలో ఆమె పాత్ర పేరును లక్ష్మిగా పరిచయం చేస్తూ.. సైరా టీం విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతున్న ఈ మూవీలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.