HomeTelugu Trending'ఆచార్య'లో ఐటమ్‌ గర్ల్‌గా మిల్కీ బ్యూటీ

‘ఆచార్య’లో ఐటమ్‌ గర్ల్‌గా మిల్కీ బ్యూటీ

Tamanna Item Song in Acharyమెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ చిత్రంలో ఐటెమ్‌సాంగ్‌లో ఎవరు నటిస్తారు అనేది వైరల్‌ అవుతోంది. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమాలో ఐదు పాటలుంటాయని… అందులో ఒకటి ప్రత్యేక గీతమని చెప్పారు. ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉంటుందని గతంలోనే తెలిసినా.. ఇప్పుడు స్పష్టత వచ్చింది. ఈ పాటలో చిరంజీవి అదిరిపోయే స్టెప్టులు వేస్తారని టాలీవుడ్‌ టాక్‌. దీంతో ఇందులో ఆయన పక్కన మెరిసిపోయే బ్యూటీ గురించి ఇప్పుడు చర్చ మొదలైంది.

‘ఆచార్య’ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ కోసం రెజీనాను సంప్రదించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయిత ఆ తర్వాత దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఈ జాబితాలోకి తమన్నా పేరు వచ్చింది. ‘సైరా’ సినిమాలో వీరిద్దరూ కలసి నటించిన విషయం తెలిసిందే. ఇందులో తమన్నా చిరుతో ఆడిపాడితే వరుసగా రెండో సినిమా అవుతుంది. ‘ఆచార్య’కు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu