HomeTelugu Big Storiesమెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. ఆచార్య అప్‌డేట్

మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. ఆచార్య అప్‌డేట్

Acharya
మెగా స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తోంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. ఈ
సినిమా విడుదల తేదీపై ఇప్పటికే పలు పుకార్లు షికార్లు చేశాయి. ముందుగా దసరాకి వస్తుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత వచ్చే సంక్రాంతికి రానుందంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు వాటన్నిటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

Acharya3

ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సెకండ్ వేవ్ ముగిశాక ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. చిన్న సినిమాలు తమ విడుదల తేదీలను ప్రకటించాయి. దసరా, క్రిస్మస్, సంక్రాంతి పండుగలు ఇప్పటికే బుకింగ్స్ అయిపోయాయి. ఆచార్య సినిమా కూడా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్య సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఆచార్య చిత్రంలో చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే, కాజల్ ఇతర ప్రధాన పాత్రలు
పోషిస్తున్న విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu