HomeTelugu Trendingతేజ సజ్జా- శివానీ రాజశేఖర్‌ 'అద్భుతం'

తేజ సజ్జా- శివానీ రాజశేఖర్‌ ‘అద్భుతం’

Teja Sajja new movie Adbut
చైల్డ్ ఆర్టిస్ట్‌ తేజ సజ్జా హీరోగా వరుస సినిమాల చేస్తూన్నాడు. ఇటీవ‌ల మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తేజ నటించిన ‘ఇష్క్’-‘నాట్ ఎ లవ్ స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్నికి ఎస్.ఎస్. రాజు దర్శకత్వం వహించాడు. ఇటీవలే ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో హనుమాన్ అనే సినిమా ప్రకటించాడు. త్వ‌రలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

మల్లిక్ రామ్ డైరెక్షన్‌లో తేజ.. శివానీ రాజశేఖర్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టైటిల్ ఫిక్స్‌ చేస్తూ.. పోస్ట‌ర్ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు ‘అద్భుతం’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మూవీ పోస్ట‌ర్ ఆక‌ట్టుకునేలా ఉంది తేజ, శివాని ఇద్దరూ ఓ టేబుల్ పై కూర్చొని టైం చూసుకుంటున్నట్లుగా మిర్రర్ ఇమేజ్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. ఇది ఫాంటసీ లవ్ స్టోరీ రూపొందిస్తున్న సినిమా అని తెలుస్తోంది. దీనికి ప్రశాంత్ వర్మ కథ రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో తులసి, శివాజీ రాజా, సత్య, మిర్చి కిరణ్, దేవీ ప్రసాద్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu