‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో అడుగుపెట్టిన రామ్‌చరణ్‌

లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్ లో సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ తిరిగి ఆరంభమైంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సెట్‌లో రామరాజు (రామ్‌చరణ్‌) అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం ఉదయం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్‌ అలీమ్‌ హకీమ్‌ చెర్రీతో దిగిన ఓ ఫొటోని షేర్‌ చేశారు.

‘లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో షూటింగ్స్‌ ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం హైదరాబాద్‌లో చరణ్‌ హెయిర్‌స్టైల్‌తో నా రోజు ప్రారంభమైంది. మనందరికీ ఎంతో ఇష్టమైన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌కి చెర్రీ సిద్ధమయ్యారు’ అని అలీమ్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates