HomeTelugu Newsమీ పాపాల చిట్టా నిండింది

మీ పాపాల చిట్టా నిండింది

13 9
స్టార్‌ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ ఆచార్యపై బాలీవుడ్‌ వెంటనే నిషేధం విధించాలని ‘హారన్‌ ఓకే ప్లీజ్‌’ నటి తనుశ్రీ దత్తా కోరారు. ఇటీవల కొరియోగ్రాఫర్‌ గణేశ్‌ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా డ్యాన్సర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనుశ్రీ దత్తా గణేశ్ గురించి స్పందించింది. మహిళలను వేధింపులకు గురిచేసే ఇలాంటి వ్యక్తులపై బాలీవుడ్‌తోపాటు చిత్ర పరిశ్రమలు కూడా నిషేధం విధించాలని పేర్కొన్నారు. ‘బాలీవుడ్‌తోపాటు భారత చలనచిత్ర రంగంలోని అన్నీ పరిశ్రమలు కొరియోగ్రాఫర్‌ గణేశ్‌పై నిషేధం విధించాల్సిన సమయమిది. సినీ పరిశ్రమలోని ఎందరో నటీనటులకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఈ వ్యక్తి.. సినీ పరిశ్రమలో ఉన్న, కొత్తగా వస్తున్న వారిని వేధించడానికి తన ఫేమ్‌ను వాడుకుంటున్నాడు. ‘హారన్‌ ఓకే ప్లీజ్‌’ సెట్‌లో నేను ఎదుర్కొన్న ఎన్నో వేధింపులకు అతను కూడా ఒక కారణం. నా పేరు ప్రతిష్టలను అతను నాశనం చేశాడు. ఎందరో స్టార్‌ హీరోలు తాము నటించే చిత్రాల్లో గణేశ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఒకానొక సమయంలో గణేశ్‌ మంచివాడు కాదని నేను చెప్పాను. కానీ ఎవరూ నమ్మలేదు. ఇప్పటికైనా తెలుసుకోండి.’ అని తనుశ్రీ తెలిపారు.

‘ఇలాంటివాళ్లతో సమాజంలో నా గౌరవం పోయింది. దీంతో నేను మానసికంగా, శారీరకంగా ఎంతో బాధను ఎదుర్కొన్నాను. ‘హారన్‌ ఓకే ప్లీజ్‌’ సెట్‌లో నేను ఎదుర్కొన్న సమస్యలు, వేధింపులు నన్ను భయానికి గురిచేశాయి. దీంతో నేను సినిమాలకు దూరంగా వెళ్లిపోయాను. నేను ఎంతో ఇష్టపడి వచ్చిన ఈ రంగంలో ఇబ్బందులు ఎదురవడంతో షాక్‌కు గురయ్యాను. ఇది మొత్తం 12 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ సమయంలో ఓ రోజు నా కారు మీద దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. నాలోని స్ఫూర్తి, ధైర్యాన్ని ఆ రోజే చంపేశారు.’ అనంతరం ఆమె గణేశ్‌ గురించి చర్చిస్తూ… ‘మీ పాపాల చిట్టా నిండింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ పాపాలు బయటకు వస్తాయి’ అని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!