HomeTelugu Trendingమహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Super Star Mahesh Babu Birthday Blaster From Sarkaru Vaari Paata

దర్శకుడు పరుశురాం – మహేష్ బాబు కాంబో లో వస్తున్న యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘సర్కారు వారి పాట’. మొదటిలో లో మామూలుగా సినిమాగానే వచ్చినా, ట్రైలర్ తో భారీ ఎక్సపెక్టషన్ పెరిగింది… మహేష్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. జీఎంబీ ఎంటర్ టైనర్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మించాయి. మే 12న చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలకు ప్రత్యేకంగా అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. నైజాంలో సర్కారు వారి పాట చిత్ర రైట్ హోల్డర్స్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ వారి రిక్వెస్ట్ మేరకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ఈనెల 12 నుంచి 18 వరకు వారం రోజుల పాటు ప్రతి రోజూ ఐదు షోలకు అనుమతినిచ్చింది. అలాగే స్పెషల్ షోలకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ షోలకు కేవలం నగరంలోని నాలుగు థియేటర్లలకే అనుమతి లభించింది.

image 5

Recent Articles English

Gallery

Recent Articles Telugu