రేటింగ్‌తో సత్తా చాటిన సమంత ఎపిసోడ్


దసరా సందర్భంగా తెలుగు బిగ్‌బాస్-4 షోకి గెస్ట్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది అక్కినేని వారి కోడలు సమంత.. ఆ షోతో మామకు తగ్గ కోడలు అనిపించుకున్న సంగతి తెలిసింది. దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో తనదైన స్టైల్‌లో మ్యాజిక్ చేసింది. నాగార్జున లేని లోటును భర్తీ చేసింది. ఈ ఎపిసోడ్‌ ఎక్కువమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ కొందరు సమంత చేసిన ఎపిసోడ్ అనుకున్నంత బాగా రాలేదని, సమంతతో పాటు బిగ్‌బాస్ ప్రోగ్రాంను ట్రోల్ చేశారు. తాజాగా ఆ ఎపిసోడ్ తాలూకు టీవీ రేటింగ్స్‌ బయటకురావడంతో విమర్శకుల నోటికి తాళం పడింది.

సమంత ఎపిసోడ్‌కి తక్కువ రేటింగ్ వచ్చిందని తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా బిగ్‌బాస్ షో అక్కినేని ఫ్యామిలీ షోగా మారిందంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు. సమంత హోస్టింగ్ పరమ చెత్తగా ఉందంటూ మరికొందరు రెచ్చిపోయారు. కానీ తాజా రేటింగ్ ప్రకారం చూస్తే సమంత చేసిన ఎపిసోడ్‌లో తాను సత్తా చాటిందని స్పష్టంగా తెలుస్తోంది. దసరా రోజు ప్రసారమైన బిగ్‌బాస్-4 ఎపిసోడ్‌కి 11.4 టీవీ రేటింగ్ వచ్చిందని అధికారిక సమాచారం బయటకొచ్చింది. ఇది చూసిన సమంత అభిమానులు తమ అభిమాన తారను అంతలా విమర్శించిన వారంతా నోరెళ్లబెట్టాల్సిందే.. ఇదీ సమంత సత్తా! అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రేటింగ్‌ని బట్టిచూస్తే సమంత చేసింది ఒక్క ఎపిసోడే అయినా మామ నాగార్జున అంచనాలను అందుకొని న్యాయం చేసిందనిపిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates