HomeTelugu Trendingపునర్నవితో రాహుల్‌ సినిమా చేస్తాడట!

పునర్నవితో రాహుల్‌ సినిమా చేస్తాడట!

1 11తెలుగు ‘బిగ్‌బాస్’- 3 ‌లో టైటిల్ విన్నర్‌గా నిలిచిన రాహుల్, మరో ఇంటి సభ్యురాలు పునర్నవి హౌస్‌లో చేసిన రెమాన్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ తెచ్చుకున్నారు. ఈ జంట బిగ్ బాస్ హౌస్‌లో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రేక్షకులు కేవలం ఈ జంట కెమిస్ట్రీని చూడటానికి ఇష్టపడేవారు. మరో వైపు రాహుల్, పున్ను ప్రేమించుకుంటున్నారని.. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్ మీడియాల్లో వార్తలు తెగ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అంతేందుకు ఈ జంట పెళ్లి చేసుకుంటే ఆనందపడే అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. అయితే రాహుల్ టైటిల్ విన్నర్‌గా నిలిచి.. బయట కొన్ని మీడియా చానల్స్‌కు, పలు యూట్యూబ్ చానల్స్‌‌తో మాట్లాడుతూ.. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని.. లవర్స్ కాదంటూ రాహుల్ చాలా సార్లు స్పష్టం చేశాడు. ఒకరికి ఒకరు ప్రాణం ఇచ్చే స్నేహం మా మధ్య ఉంది అంతే కాని మరేమీ లేదని చెప్పుకొచ్చాడు రాహుల్‌.

అది అలా ఉంటే.. ఇటీవల ఓ ప్రముఖ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ఓ ప్రశ్నకు సమాదానంగా.. పునర్నవితో సినిమా అవకాశం వస్తే హీరోగా నటిస్తావా.. అంటూ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాడు. పునర్నవితో సినిమా అవకాశం వస్తే.. తప్పుకుండా సినిమా చేస్తానని తన ఇష్టాన్ని బయటపెట్టాడు. దీంతో తెలుగు సినిమా నిర్మాతలు మంచి లవ్ స్టోరితో ఓ సినిమాను ప్లాన్ చేసే అవకాశాలు మెండుగానే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ జంటకు యూత్‌లో విపరీతంగా క్రేజ్‌ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ నిర్మాత ముందుకొచ్చిన మినిమం గ్యారెంటీగా హిట్ అయ్యే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!