పవన్ సినిమాకు చిరు విలన్!

టైటిల్ చూసి పవన్ కల్యాణ్ సినిమాలో చిరు విలన్ అనుకుంటే పొరపాటే.. అసలు విషయంలోకి వస్తే చిరంజీవి సినిమాలో నటిస్తోన్న విలన్ ఇప్పుడు పవన్ సినిమాలో కూడా విలన్ గా ఎంపిక చేసుకుంటున్నారు. చాలా కాలం గ్యాప్ తరువాత చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమాలో విలన్ గా తరుణ్ అరోరా ను ఎంపిక చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల కాక ముందే తరుణ్ అరోరా పవన్ కల్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.

పవన్ ప్రస్తుతం నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా లో విలన్ పాత్ర కోసం తరుణ్ అరోరా ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. దర్శకుడు ఈ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పొల్లాచి లో జరుగుతోంది. పవన్ కు, అతని సోదరులకు సంబంధించిన ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.