HomeTelugu Big Storiesకుండ బద్దలు కొట్టించిన బిగ్‌బాస్

కుండ బద్దలు కొట్టించిన బిగ్‌బాస్

10 5
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా నడుస్తూ 81 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. నేడు (అక్టోబర్ 10) నాటికి 82వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. షో ముగింపు దశకు వస్తుండటంతో ఆటను మరింత రంజింప చేసేందుకు బిగ్‌బాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకరి కొకరు తెలియకుండా సీక్రెట్‌గా మాట్లాడుకున్న వీడియోలను ఇంటి సభ్యులకు చూపించి వాళ్లలో వాళ్లకే గొడవలు పెట్టే ప్రయత్నం చేశాడు. హంట్ అండ్ హిట్‌ టాస్క్ లో భాగంగా మాకు తెలుసు మీకు ఏంకావాలో అంటూ బిగ్ బాస్ హౌస్‌లో జరిగే గుసగుసలను బహిర్గతం చేశాడు. మూడు రౌండ్లుగా జరిగే ఈ టాస్క్‌లో తొలి రౌండ్‌లో భాగంగా బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక బూత్ ఏర్పాటు చేసి.. అందులో ప్రతి ఇంటి సభ్యుడికి సంబంధించిన ఓ ముఖ్యమైన వీడియోను ప్లే చేసి చూపించారు.

ఆ వీడియోలో తమ గురించి మాట్లాడిన వ్యక్తిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఆ విషయం గురించి చర్చించి.. తరువాత తమ గురించి మాట్లాడిన వ్యక్తి ఫొటోను ఓ కుండకు అంటించి ఆ కుండను దిష్టిబొమ్మకు పెట్టి కర్రతో ఆ కుండను పగలగొట్టాలి. అదీ గేమ్‌. ముందుగా ఈ గేమ్‌లో బాబా భాస్కర్ వచ్చాడు. తన గురించి రాహుల్, వరుణ్, వితికా, మహేష్, అలీ వీరంతా ఏమనుకుంటున్నారో ఆ వీడియోలో చూపించాడు. వీడియోలో వాళ్ళ మాటలు విన్న బాబా భాస్కర్.. అలీ మాటలకు బాధపడ్డాడు. అక్కడ నుండి వచ్చి ఇక్కడ గెలుస్తా అని ఆయన అంటున్నాడు అంటూ అలీ ప్రాంతీయతను రెచ్చగొట్టడంపై బాబా భాస్కర్ ఎమోషన్ అయ్యారు. నేను అసలు గెలుస్తా అని ఎప్పుడూ చెప్పలేదు అంటూ అలీని పిలిచి ఆ విషయంలో చర్చించాడు. అనంతరం అలీ ఫొటోను దిష్టిబొమ్మకు పెట్టి కర్రతో పగలగొట్టి కసి తీర్చుకున్నాడు.

తర్వాత శ్రీముఖి గురించి అలీ, శివజ్యోతి, మహేష్ విట్టాలు నెగిటివ్‌గా మాట్లాడిన విషయాలను చూపించాడు. అది విన్న శ్రీముఖి వాళ్లను పిలిచి సీరియస్‌గా చర్చించింది. నీ యక్కా.. అంటూ మొదట అలీని బయటకు పిలిచి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేసింది. ఇక అలీతో శ్రీముఖి మాట్లాడుతుంటే.. శ్రీముఖి గురించి మహేష్ మిగతా సభ్యుల వద్ద ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయడంతో అతనితో చర్చించకుండానే మహేష్‌ని బయటకు పిలిచి దిష్టిబొమ్మకు మహేష్ తలకాయ ఉన్న కుండను పెట్టి కసితీరా కర్రతో కొట్టి ముక్కలు చేసింది శ్రీముఖి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!