HomeTelugu Trendingటాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కన్నుమూత

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కన్నుమూత

Telugu producer doraswamy r
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వి. దొరస్వామి రాజు కన్నుమూశారు. వయో భారం కారణంగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించటంతో.. గత కొద్దిరోజులుగా బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. వీఎంసీ పేరుతో డిస్ట్రిబ్యూషన్‌ సంస్థను స్థాపించిన దొరస్వామి పలు హిట్‌ సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశారు. తొలిసారి ఎన్టీఆర్‌ హీరోగా నటించిన సింహబలుడు సినిమాను పంపిణీ చేశారు. డ్రైవర్‌ రాముడు, వేటగాడు, యుగంధర్‌, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి సినిమాలను వీఎంసీ సంస్థ ద్వారా విడుదల చేశారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సినిమాలను నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!