HomeTelugu Newsచంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

చంద్రబాబుని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

11 3

విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది… అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తలపెట్టిన బస్సు యాత్రకు బయల్దేరిన బస్సులను అనుమతి లేదంటూ ఆటోనగర్‌లో పోలీసులు సీజ్ చేయడంతో గందరగోళం నెలకొంది. అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయంలో సమావేశం ముగిసిన తర్వాత బస్సులు అడ్డుకున్న ఆటోనగర్ ప్రాంతానికి టీడీపీ నేత చంద్రబాబు, టీడీపీ నాయకులు, వామపక్ష నేతలు పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రను విరమించుకోవాలని సూచించారు.

దీంతో పోలీసులపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసులతో చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు, జేఏసీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు 2 గంటల పాటు విజయవాడ బెంజ్ సర్కిల్‌ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైవేపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసుల వ్యవహార శైలి ఏంటి? అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్రకు అనుమతించాలని కోరిన చంద్రబాబు… సీజ్ చేసిన బస్సులను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చంద్రబాబు, వామపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరికి రెండు గంటల హైడ్రామా అనంతరం పోలీసులు చంద్రబాబును, టీడీపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో చంద్రబాబును ఆయన నివాసంలో వదిలారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu