‘విజయ్‌ 67’ టైటిల్‌ విడుదల


కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా- యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలోని కీలక పాత్రల్లో సంజయ్ దత్ ప్రియా ఆనంద్ అర్జున్ మిస్కిన్ మన్సూర్ అలీఖాన్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో విజయ్ నటిస్తున్న రెండవ సినిమా ఇది.

ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల కశ్మీర్ లో మొదలైంది. తాజాగా ఈ మూవీ టైటిల్ ని ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ మూవీకి `లియో` అనే టైటిల్ ని మేకర్స్ ఫైనల్ చేశారు. టైటిల్ ని వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. నిర్మానుణ్యంగా వున్న ప్రదేశంలోని ఓ ఇంట్లో హీరో విజయ్ చాకోలేట్స్ తయారు చేస్తూ కనిపించాడు. పీనాట్స్ ని గ్రౌండ్ చేస్తూ చాక్లెట్ సిద్ధం అవుతుండగా కారు చీకట్లో గ్యాంగ్ స్టర్ ల ఓ భారీ కాన్వాయ్ తనని వెతుక్కుంటూ వస్తున్నట్టుగా చూపించాడు. టైటిల్ తో పాటు ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని అక్టోబర్ 19న రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.

CLICK HERE!! For the aha Latest Updates