HomeTelugu Big Storiesతంగలాన్‌: పాముని రెండు ముక్కలుగా చేసిన విక్రమ్‌

తంగలాన్‌: పాముని రెండు ముక్కలుగా చేసిన విక్రమ్‌

Thangalaan
తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు‌. భిన్నమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం తంగలాన్. పా రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్​ విడుదలైంది.

ఈ సినిమాలో విక్రమ్‌ లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లు విడుదలై ఆసక్తిని రేకెత్తించాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

టీజర్‌లో బంగారు గనుల దగ్గర ఉండే గ్రామాల్లోని మనుషులు, ఆంగ్లేయులకు మధ్య యుద్ధ సన్నివేశాలను భయంకరంగా చూపించారు. ముఖ్యంగా విక్రమ్​ను మరింత భయంకరంగా చూపించారు. కత్తి పట్టుకొని ఎదురొచ్చే వాళ్లని నరికేస్తూ, ఓ సీన్​లో అయితే చేత్తోనే పాముని రెండు ముక్కలుగా చేసి పడేస్తున్నట్టు వైల్డ్​గా చూపించారు.

బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథ అని తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు. విక్రమ్ గెటప్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఒక్క డైలాగ్ కూడా లేని ఈ ప్రచార చిత్రం సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

మొత్తంగా సినిమా రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని అర్ధమౌతోంది. ఈ సినిమాలో మాళవిక మోహన్‌, పార్వతి తిరువోతు, పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్‌, నీలం ప్రొడక్షన్‌ సంస్థల పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ స్వరాలందించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu