HomeTelugu Big Storiesఆసక్తికరంగా 'తంగలాన్‌' మేకింగ్‌ వీడియో

ఆసక్తికరంగా ‘తంగలాన్‌’ మేకింగ్‌ వీడియో

Vikram kills it in Thangalaans first lookతమిళ ప్రముఖ నటుడు విక్రమ్‌.. ఎప్పుడూ.. ప్రయోగాలు చేయడంలో ముందు ఉంటాడు. ‘అపరిచితుడు’, ‘ఐ’ సినిమాలతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. ఇటీవల మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమాలో మెరిశారు. ప్రస్తుతం ‘తంగలాన్‌’ సినిమా పూర్తి చేస్తున్నారు.

సెన్సేషనల్ డైరెక్టర్ పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న చిత్రం తంగలాన్. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదల చేసిన విక్రమ్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. సోమవారం విక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఈ వీడియో అద్భుతంగా ఉంది.

ఈ సినిమా కోసం తన దేహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు విక్రమ్‌. డీ గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించిన విక్రమ్‌.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. వీడియో చివర్లో వచ్చే సీన్.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.19వ శతాబ్దంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్ నేపథ్యంలో తంగలాన్ తెరకెక్కుతోంది.

తమిళంతో పాటు తెలుగులోనూ దీనిని విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్‌ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్‌, పార్వతి నటిస్తున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu