
అసలు ఏపీ ప్రజలు ఏం ఆలోచిస్తారో ఎవరికి అర్థం కాదు అంటూ పక్క రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఏపీ ప్రజలు బయట పెట్టడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు అని పక్క రాష్ట్రాల ప్రజలకు, నాయకులకు అర్థం కాకపోవచ్చు. కానీ, ఆంధ్రా ప్రజలను అంత చులకనగా చూడాల్సిన అవసరం లేదు. కారణం ఎక్కడైనా తన అవసరానికి తగ్గట్టు మారిపోవడం, లేదా పరిస్థితులను మార్చుకోవడం తెలుగువాడి నైజం. కాబట్టి.. జగన్ రెడ్డి పతనానికి కూడా తెలుగు ప్రజలు అదును కోసం కాసుకొని కూర్చున్నారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీదే పడుతుందని సామెత. అందుకే, అనవసరంగా చించుకోవడం లేదేమో.
అవసరం వచ్చినప్పుడు ప్రజలు గట్టి తీర్పు ఇస్తారు. అభివృద్ధి అనే పదాన్ని ఏపీ నుంచి జగన్ రెడ్డి ఎప్పుడో తీసేశాడు అని ఆంధ్రా ప్రజలకు తెలుసు. ఐటీ కంపెనీల కోసం పక్క రాష్ట్ర ప్రభుత్వాలు పోటా పోటీగా ఎన్నో ప్రోత్సాహకాలు కల్పించి వాటి ఏర్పాటు కోసం కృషి చేస్తూ ఉంటే.. అసలు ఏపీ లో జగన్ రెడ్డి ఐటీ అనే పదాన్నే లేకుండా చేస్తున్నాడు అని కూడా ప్రజలకు తెలుసు. అసలు ఏపీలో పరిశ్రమ కానీ, ఉపాధి కల్పన ఇలాంటి వాటికి అవకాశమే లేదు అని కూడా ఏపీ ప్రజలకు తెలుసు. ఇంతేనా.. ఆంధ్రా ప్రజలకు ప్రతిదీ తెలుసు.
ఏపీ ప్రజలంతా జగన్ ప్రభుత్వ ఉచిత పథకాల మాయలో ఉన్నారని అనుకోవడం అవగాహన లోపమే. నిజమే.. ప్రస్తుతానికి అయితే.. ఏపీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బయటకు రావడం లేదు. కానీ, వస్తే ఏం జరుగుతుంది ?, అమరావతి రైతులు పాదయాత్ర చేసి చేసి విసిగిపోయారు. వ్యక్తిగతంగానూ ఎంతగానో నలిగిపోయారు. వారి జీవితాలు కూడా బాగా నలిగిపోయాయి. కానీ చివరకు వారంతా ఏం సాధించారు ?, జగన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి అంటే.. కావాల్సింది ఆవేశం కాదు. ఆలోచన, అంతకుమించి సరైన సమయం. ఆ సమయం ఎన్నికలే. ఒక్క ఎన్నికల్లోనే జగన్ రెడ్డి నడ్డి విరవగలం అని ఏపీ ప్రజలకు బాగా తెలుసు.
అందుకే, రానున్న ఎన్నికల కోసం ప్రతి ఆంధ్రా కుటుంబం కాసుకొని కూర్చుంది. ఒక పక్క శ్రీలంక, పాకిస్థాన్ దేశాల దీన పరిస్థితి చూసి కూడా ఇంకా బటన్ రెడ్డిని ఎలా వదలి పెడతారు. సానుభూతితో వచ్చే గెలుపు, ఎక్కువ కాలం ఉండదు. ఎప్పుడైనా సామర్థ్యంతో గెలిస్తేనే ఆ గెలుపుకు అర్థం ఉంటుంది. ఆ గెలుపు కూడా పది కాలాల పాటు వర్ధిల్లుతూ ఉంటుంది. జగన్ రెడ్డి ముందు ఇది తెలుసుకో.












