Homeతెలుగు Newsరాజకీయాల్లో మార్పులొస్తున్నాయి: వామపక్షాలు

రాజకీయాల్లో మార్పులొస్తున్నాయి: వామపక్షాలు

విజయవాడలోని సిద్దార్ద ఆడిటోరియంలో జరిగిన సదస్సులో వామపక్ష నేతలు మధు, కె.రామకృష్ణ, సహా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ద్విముఖ పోటీ పోయి త్రిముఖ పోటీ రావటమే రాజకీయాల్లో మార్పునకు నిదర్శనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. జనసేన, సీపీఎం, సీపీఐ కలసి ఉమ్మడి ఉద్యమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎస్) విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

4 19

ఉద్యోగుల పట్ల మోడీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని, సెప్టెంబరు 15న విజయవాడ లో సీపీఎస్‌కు వ్యతిరేకంగా గర్జన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇది ఉద్యోగుల తమ జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారన్నారు. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, న్యాయం జరగాలంటే అటార్ని జనరల్ ను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ అధ్వర్యంలో ఈనెల 20న తలపెట్టిన హెల్త్ యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం మద్దతిస్తాయని
రామకృష్ణ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu