సానియా సోదరి పెళ్లిలో రామ్‌ చరణ్‌ డాన్స్

టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సోదరి ఆనమ్‌ మీర్జా పెళ్లి వేడుకల్లో హీరో రామ్‌ చరణ్‌ సందడి చేశారు. సానియా, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌తో కలిసి చిందేశారు. ఓ గాయని పాట పాడుతుండగా వీరు ముగ్గురు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఉపాసన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘రాకింగ్‌ ది డ్యాన్స్‌ ఫ్లోర్‌ అంటే ఇదే’ అని కామెంట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. చరణ్‌, ఫరా ఖాన్‌ స్టెప్పులు అదరగొట్టారని.. సానియా కూడా వారికి ఏ మాత్రం తీసిపోలేదని కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా మాజీ సారథి మహ్మద్‌ అజహరుద్దీన్‌ కుమారుడు మహ్మద్‌ అసదుద్దీన్‌తో ఆనమ్‌ మీర్జా వివాహం జరిగింది. ఈ వేడుకకు ప్రముఖులు హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. ఆనమ్‌, అసద్‌ ఒక్కటి కాబోతున్నారని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అక్టోబర్‌లో సానియా మీర్జా ధ్రువీకరించారు.

CLICK HERE!! For the aha Latest Updates