HomeTelugu Trending'ది ఘోస్ట్' : క్రేజీ అప్డేట్‌

‘ది ఘోస్ట్’ : క్రేజీ అప్డేట్‌

The Ghost movie Update
కింగ్ నాగార్జున నటిస్తున్న చిత్రం ‘ది ఘోస్ట్’ . తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓ యాక్షన్ సీక్వెన్స్ మినహా ఈ సినిమాకు సంబంధించిన మిగతా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

‘ది ఘోస్ట్’ ఫస్ట్ విజువల్ ను జులై 9న విడుదల చేయనున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు ఓ సర్‌ప్రైజింగ్ పోస్టర్‌ను వదిలారు. ఇందులో “కిల్లింగ్ మెషీన్ ని వదులుతున్నాం” అని పేర్కొన్నారు. ఈ సినిమాలో నాగ్ తొలిసారిగా ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకాలపై పుష్కర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!