
జగన్ రెడ్డి ‘అప్పు’డే తెల్లారిందా ? అని అనుకోని రోజు ఉండడం లేదు అంటే అతిశయోక్తి కాదు. అసలు జగన్ రెడ్డి ప్రభుత్వం అంతగా అప్పులు చేయడానికి గల కారణం ఏమిటి ? అంటూ సగటు సామాన్యుడు కూడా తన బుర్రకు పని పెడుతూనే ఉన్నాడు. జగన్ రెడ్డి లెక్కల వ్యవహారం ఐటీ డిపార్ట్మెంట్ కే ఓ పట్టాన అంతు చిక్కడం లేదు. ఇక సామాన్యులకు ఏం అర్ధం అవుతుంది ?. అసలు జగన్ రెడ్డి దృష్టిలో అప్పులు చేయడం అనేది సహజ ప్రక్రియ. నిజానికి ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేసి తీరాల్సిందే. అయితే, ఒక్క జగన్ రెడ్డి ప్రభుత్వం చేసే అప్పులు మాత్రమే ఎందుకు చర్చకు వస్తున్నాయి అనేది ముఖ్యమైన ప్రశ్న. విభజన నాటికే 2 లక్షల కోట్ల అప్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉంది. ఇది వై యెస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చినది. రాష్ట్ర విభజన అనంతరం ఒక లక్ష కోట్ల అప్పు ఆంధ్రుల నెత్తిన పడింది. దీని కారణంగానే అమరావతి నిర్మాణానికి చంద్రబాబు గారు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు చేయలేక పోయారు. ఆయన చేసిన ప్రయత్నాలు విఫలం అయి వారు కొత్త అప్పు ఇవ్వడానికి నిరాకరించారు.
బహుశా, ఇక్కడే మోదీ గారికి చంద్రబాబు గారికి చెడింది. కేంద్రం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి కాకుండా, దేశంలో ఉన్న బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేసుకోమని సలహా ఇచ్చింది. దానికి కూడా బోలెడు ఆంక్షలు పెట్టింది. ఒక రకంగా కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడికి సరైన సాయం అందలేదు. చివరకు అప్పు చేసుకోవడానికి కూడా కేంద్ర సపోర్ట్ చేయలేదు. కట్ చేస్తే.. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది. మోదీ కారణంగా.. జగన్ రెడ్డి అప్పుల కుప్పగా ఆంధ్ర ప్రదేశ్ ను మార్చేశారు. జగన్ రెడ్డి చేసిన లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కట్టాలి, పైగా ప్రభుత్వాన్ని నడపాలి. ఇక్కడేమో.. జగన్ రెడ్డికి ఉన్న అనుభవ లేమి వలన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కఠినంగా మారింది.
ఈ నేపథ్యంలోనే జగన్ రెడ్డి మందును వరదలా పారిస్తున్నాడు. ఐతే, జగన్ నూతన మద్య విధానం వల్ల కొంతమంది జేబుల్లోకి కోట్లు వెళ్తుంటే, ప్రభుత్వానికి మాత్రం అత్యల్ప ఆదాయం వస్తుంది. ఇంతకీ ఆ కొంతమంది ఎవరు ? అందరూ జగన్ రెడ్డి తాలూకానే. అందరూ జగన్ రెడ్డి బినామీలే. చివరకు ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. దీనికితోడు ఆంధ్ర ఆదాయానికి అన్ని దారులు మూసుకొని పోయిన ఈ పరిస్థితుల్లో జగన్ రెడ్డి తన ప్రభుత్వం పరువు కాపాడుకోవడానికి అప్పులు చేయడమే మార్గంగా భావిస్తున్నాడు. ఇక ప్రభుత్వ ఆస్తులు అమ్మే ప్రక్రియ వున్నా.. ఒకే ఆస్తిని ఎన్నిసార్లు అమ్మగలరు. అది కాక ఈ అమ్మకం అనేది కొంతమంది పెద్దలు జాగ్రత్తగా విలువైన భూమిని కైవసం చేసుకునే పద్దతి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల మెడకు అప్పులు దూసుకొచ్చి.. రాష్ట్రం కష్టంగా నెట్టుకొస్తూ ఉంది.
ఏది అయితే ఏం.. జగన్ రెడ్డి పైత్యం కారణంగా కావొచ్చు, లేదా జగన్ రెడ్డి అనుభవం లేమి కారణంగా కావొచ్చు. నేడు ఆంధ్ర రాష్ట్రం నాశనం అయ్యే స్థితిలో ఉంది. కాదు కాదు, ఆ స్థితికి ఎప్పుడో చేరిపోయింది. అయితే, ఈ మొత్తం వ్యవహారానికి కారణం జగన్ రెడ్డి ఒక్కడే. అసలు జగన్ రెడ్డి ఎలాంటి వాడో.. ఒక్క మాటలో ముచ్చటించుకుందాం. జగన్ రెడ్డి దేవాలయాలను దోచి, ఆ సొమ్ముతో దేవాలయాలు ఉండకూడదు అనే వాళ్ళను మేపుతున్నాడు. దేవాలయాల ఆస్తులను అమ్మి పాస్టర్లు,. ఇమాంలకు జీతాలు ఇస్తున్నాడు. ఇది అత్యంత నీచమైన దుశ్చర్య.











