
జగన్ ఇచ్చిన వాలంటీర్ జాబ్ లు, రాజకీయ పన్నాగాలు కారణంగా యువత పాడైపోతుందా ?, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర నలుమూల్లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా పగలు ప్రతీకారాలు రగిలిపోతున్నాయి. పచ్చని పల్లెటూర్లలో ఇంత మార్పా ? అని ఆశ్చర్యం కలగకమానదు. ముఖ్యంగా జగన్ పాలనలో యువత బాగా చెడిపోయింది. తన స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ మోహన్ రెడ్డి యువతలో ఉన్న శక్తి సామర్ధ్యాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న యువతకు ఇప్పుడు దిక్కు ఏది ?. ఉక్కు నరాలు , ఇనుప కండరాలు ఉన్న యువతతోనే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఎప్పుడో స్వామి వివేకానంద ఉద్భోదించారు.
కానీ, దేశానికి పట్టుకొమ్మల్లాంటి ఆ యువతను మద్యం, గంజాయి, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలకు బానిసలగా మార్చేశాడు జగన్ రెడ్డి. జగన్ హయాంలో యువశక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. ఈ విషయంలో ఎందరు మేధావులు ఆవేదన వ్యక్తం చేసినా… జగన్ పాలనా తీరు మాత్రం మారలేదు. పైగా రోజురోజుకు రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కాబట్టి.. రాష్ట్రంలో యువతను తప్పుదోవ పట్టిస్తున్న దారుల పై ప్రజలే శంఖారావాన్ని పూరించవలసిన అవసరం ఉంది. నిరుద్యోగులకు , యువతకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ప్రతి మేధావి పైనా ఉంది.
మన యువత – మన భవిత అని మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ముందుకు వెళ్ళాలి. లేకపోతే.. ఇప్పటికే మత్తులో మునిగిపోయిన గ్రామ యువత జీవితాలు పూర్తిగా నాశనం అవుతాయి. జగన్ ది పోయేది ఏముంది ?, ఈసారి ఓడిపోతే రాష్ట్రం నుంచి పారిపోతాడు. కానీ పాడైన యువత మళ్ళీ బాగు పడాలి అంటే.. మళ్ళీ ఎంతో కాలాన్ని పన్నంగా పెట్టి శ్రమ చేయాలి. కాబట్టి.. మత్తు నుంచి యువత త్వరగా మేల్కోవాలి.
ఇన్నాళ్లు తన దాష్టీకాల , అరాచకాల నుంచి యువత దృష్టి మరల్చేందుకే రాష్ట్రాన్ని గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు నిలయంగా మార్చాడు జగన్ రెడ్డి. యువతకు ఇరవై ఐదు కేజీల బియ్యం ఇచ్చి, వారి 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తును కాజేశాడు. జగన్ పాలన మొత్తంలో అత్యంత నీచమైనది ఇదే. ఇటికైనా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున యువకులు జగన్ మత్తు రాజ్యానికి వ్యతిరేకంగా తరలిరావాలి, పోరాడాలి. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది.