Gold Rate Today : గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు కొండెక్కి కూర్చున సంగతి తెలిసిందే. అయితే వరుసగా గత మూడు రోజు బంగారం ధరలు పడిపోయాయి. వరుసగా పడిపోతుండడం బంగారం కొనుగోలుదారులకు ఊరటగా చెప్పవచ్చు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తుండడమే దేశీయంగా ధరలు పడిపోయేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శుభముహూర్తాలు లేకపోవడం… పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో ఈ రోజు (మే 15)న బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
గ్లోబల్ బులియన్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2356 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 28.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ.83.503 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజులుగా పడిపోతూ వస్తున్నాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.400 మేర తగ్గి రూ. 66,750 వద్దకు దిగివచ్చింది. గత మూడు రోజుల్లో చూసుకుంటే రూ.800 మేర పడిపోయింది. అదే 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే ఇవాళ 10 గ్రాములకు రూ. 430 తగ్గింది. దీంతో తులం రేటు రూ. 72,820కి దిగివచ్చింది. మూడు రోజుల్లో మొత్తంగా రూ. 870 మేర దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.400 పడిపోయి రూ.66 వేల 750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.430 పడిపోయి రూ. 72 వేల 820 వద్దకు దిగివచ్చింది.
అయితే గత మూడు రోజుల పాటు తగ్గిన వెండి ధర ఈ రోజు పెరగడం గమనార్హం. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.700 మేర పెరిగి రూ. 87 వేల 200 వద్దకు ఎగబాకింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నా ఇవాళ కిలో వెండి రూ.700 పెరిగి రూ. 87,200 వద్ద ట్రేడింగ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు అనేవి ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. స్థానిక పన్నులు, జీఎస్టీ వంటివి కలుపుకొంటే ధరల్లో వత్యాసం ఉంటుందని కొనుగోలుదారులు గమనించాలి.