HomeTelugu Trendingమారుతి సినిమాలో అజయ్‌ ఘోష్‌!

మారుతి సినిమాలో అజయ్‌ ఘోష్‌!

Tollywood director maruthi
టాలీవుడ్‌ టాలెంట్ యాక్ట‌ర్స్‌ చాలా మందే ఉన్నారు. అయితే వారికి బ్రేక్ రావాలంటే ఇండ‌స్ట్రీలో ఎవ‌రో ఒక‌రి సాయం కావాల్సిందే. నటుడు జ‌గ‌ప‌తిబాబు కు కూడా లెజెండ్ సినిమాతో బ్రేక్ ఇచ్చాడు డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను. అదేవిధంగా డైరెక్ట‌ర్ మారుతి సీనియ‌ర్ న‌టులు ముర‌ళీ శ‌ర్మ‌, రావు ర‌మేశ్‌, స‌త్య‌రాజ్ లాంటి వారికి లైఫ్ ఇచ్చారు. ఇక తాజాగా మారుతి జాబితాలో ఇపుడు టాలెంటెడ్ యాక్ట‌ర్ అజయ్ ఘోష్ చేరిపోయాడు.

మారుతి తెర‌కెక్కిస్తున్న కొత్త సినిమాలో హీరోతో స‌మాన స్థాయిలో ప్రాముఖ్య‌త ఉండే పాత్ర‌ను పోషిస్తున్నాడ‌ట అజ‌య్ ఘోష్‌. సాధార‌ణంగా, రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్ రాజ్ లాంటి న‌టులు పోషించాల్సిన రోల్‌ను అజ‌య్ ఘోష్ కు ఇచ్చాడ‌ట మారుతి. జ్యోతిలక్ష్మి, రంగ‌స్థ‌లం, అమ్మోరు త‌ల్లి చిత్రాల్లో అజ‌య్ ఘోష్ పోషించిన పాత్ర‌ల‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu