HomeTelugu Newsఅబ్దుల్‌కలాం బయోపిక్‌..?

అబ్దుల్‌కలాం బయోపిక్‌..?

6 25

సినీ ఇండస్ట్రీలలో ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే సినీ తారలు, క్రీడాకారుల జీవితాలతో పాటు పలువురు రాజకీయ నాయకుల కథలు కూడా వెండితెర మీద సందడి చేస్తున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ప్రముఖుడు చేరనున్నాడు. మిసైల్‌ మ్యాన్‌గా భారత దేశానికి ఎన్నో సేవలందించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జీవితాన్ని సినిమాగా రూపొందించేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తెలుగు నిర్మాతలు అనిల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ హాలీవుడ్‌ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించానున్నారు. వెపన్స్ ఆఫ్ పీస్ అనే పుస్తకం ఆధారంగా బయోపిక్ ను నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్నారట. ఇప్పటికే కథ విన్న అనిల్‌ కపూర్‌ నటించేందుకు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు మాత్రం చురుగ్గా సాగుతున్నాయి. కొత్త సంవత్సరంలో ఈ సినిమాను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!