HomeTelugu Newsటాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత మృతి

tollywood senior producer kటాలీవుడ్‌లో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ గుండెపోటుతో మరణించారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ కన్నుమూశారు. నిన్న రాత్రి 8.50 గంటలకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా బెంగళూరులో ఆయన మృతి చెందారు. మొత్తం 40కి పైగా చిత్రాలను సత్యనారాయణ నిర్మించారు. ‘పాండురంగ మహాత్యం’ అనే డబ్బింగ్ సినిమా ఆయన తొలి చిత్రం. కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయామోహిని ఆయన నిర్మించిన సినిమాల్లో కొన్ని. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆయన పలు చిత్రాలను నిర్మించారు. సత్యనారాయణ మృతి పట్ల పులువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu