
Tom Cruise Remuneration for Mission Impossible The Final Reckoning:
టామ్ క్రూజ్ హీరోగా తెరకెక్కిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యాక్షన్ ఫ్రాంచైజీ Mission: Impossible సిరీస్‌లో తాజా చిత్రం ‘ది ఫైనల్ రెకనింగ్ (2025)’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం మే 17న భారతదేశంలో విడుదల కానుంది – అమెరికాలో విడుదలకు వారం ముందే! ఇది టామ్ క్రూజ్ చివరిసారి ఇథన్ హంట్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నదన్న ఊహాగానాలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి.
రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్
ఈ చిత్రం కేవలం కథలోనే కాదు, ఖర్చుల్లోనూ భారీగానే ఉంది. ఈ సినిమా బడ్జెట్ రూ. 3,300 కోట్లు (అంటే సుమారు $400 మిలియన్). ఇది ఇప్పటివరకు తీసిన అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి. భారీ యాక్షన్ సన్నివేశాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన షూటింగ్, టాప్ క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్ వంటివి ఇందులో ఉన్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 8,300 కోట్ల వరకు వసూలు చేయాలి!
ఈ సినిమా కోసం టామ్ క్రూజ్ రూ. 820 కోట్లు నుంచి రూ. 984 కోట్ల వరకు సంపాదించనున్నాడని అంచనా. ఇందులో ప్రధాన పారితోషికంతో పాటు, నిర్మాతగా లాభాల్లో పంచ్ కూడా ఉంది. సినిమా హిట్ అయితే అతనికి వచ్చే ఆదాయం మరింత ఎక్కువవుతుంది.
ఇతర మిషన్ ఇంపాజిబుల్ చిత్రాల నుంచి టామ్ క్రూజ్ సంపాదన (ఇండియన్ కరెన్సీ లో):
1996 (Part 1): రూ. 576 కోట్లు
2000 (Part 2): రూ. 616 కోట్లు
2006 (Part 3): రూ. 616 కోట్లు
2011 (Ghost Protocol): రూ. 616 కోట్లు
2015 (Rogue Nation): రూ. 616 కోట్లు
2018 (Fallout): రూ. 616 కోట్లు
2023 (Dead Reckoning Part 1): రూ. 574–820 కోట్లు
2025 (The Final Reckoning): రూ. 820–984 కోట్లు (అంచనా)













