
Top 10 Female Stars 2025:
ఇండియన్ సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. Ormax Media విడుదల చేసిన 2025 మార్చి లిస్ట్ చూస్తే సౌత్ హీరోయిన్‌లు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ఆదరణ పొందుతున్నారో స్పష్టమవుతుంది.
ఈ టాప్ 10 మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ లిస్ట్‌లో 7 మంది సౌత్ స్టార్ హీరోయిన్స్ చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ నుండి కేవలం మూడుగురు మాత్రమే టాప్ 10లో ఉన్నారు – అలియా భట్ (2వ స్థానం), దీపికా పదుకునే (3వ స్థానం), కత్రినా కైఫ్ (10వ స్థానం).
సమంతా అదిరిపోయిన ఫీట్!
మూడో నెల కూడా సమంతా రూత్ ప్రభు నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆరోగ్య సమస్యల్ని కూడా తట్టుకుని, నటనతో పాటు తన నిర్మాణ సంస్థ Tralala Moving Pictures ద్వారా ‘శుభం’ థియేట్రికల్ ప్రొడక్షన్‌ని పూర్తి చేసింది. త్వరలోనే సమంతా నటించిన వెబ్ సిరీస్ రక్త బ్రహ్మండ్ రిలీజ్ కానుంది.
కత్రినా కైఫ్ టాప్ 5 నుంచి ఔట్
ఒక్క సమయంలో టాప్ 5లో ఉన్న కత్రినా కైఫ్, ఇప్పుడు 10వ స్థానానికి దిగజారింది. ఇక ప్రియాంక చోప్రా కూడా తన ఇండియన్ సినిమా రీ ఎంట్రీ కోసం రెడీ అవుతూ, మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్ట్ ద్వారా మళ్ళీ టాప్ ర్యాంక్స్ చేరే అవకాశముంది.
▶️ Top 10 పాపులర్ హీరోయిన్స్ (మార్చి 2025):
1. సమంతా రూత్ ప్రభు
2. అలియా భట్
3. దీపికా పదుకునే
4. కాజల్ అగర్వాల్
5. రష్మిక మందన్న
6. సాయి పల్లవి
7. త్రిషా
8. నయనతార
9. అనుష్క శెట్టి
10. కత్రినా కైఫ్