HomeTelugu Newsమన పెళ్లికి నేనెప్పుడో ఓకే చెప్పేశా

మన పెళ్లికి నేనెప్పుడో ఓకే చెప్పేశా

4 6నటి త్రిష శనివారం తన 37వ పుట్టిన రోజును జరుపుకొన్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌లో అందరికీ పేరు పేరునా రీట్వీట్‌ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేసింది త్రిష. అందులో భాగంగా ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన చార్మి ట్వీట్‌పై కూడా స్పందించింది. ‘శుభాకాంక్షలు చెప్పినందుకు కృతజ్ఞతలు. మన పెళ్లిపై నేనెప్పుడో ఓకే చెప్పేశా…’ అంటూ కొంటెగా సమాధానమిచ్చింది త్రిష. ప్రస్తుతం వీరి ట్వీటు, రీట్వీటులపై అభిమానులు మీమ్స్‌ కూడా వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!