HomeTelugu Trendingమూడేళ్ల తరువాత ఓటీటీలో త్రిష మూవీ

మూడేళ్ల తరువాత ఓటీటీలో త్రిష మూవీ

Trisha starrer saturanga ve
త్రిష ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా తమిళంలో మాత్రం సినిమాలు చేస్తోంది. తెలుగులో స్టార్ హీరోలతో చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన త్రిష ప్రభాస్‌తో వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. చివరిగా రజనీ పేటా సినిమాలో నటించింది. త్రిష నటించిన 96 సినిమా ఎంతో విజయవంతమైంది. మూడేళ్ల క్రితం అరవింద్‌ స్వామితో ‘శతురంగ వెట్టయ్ -2’ అనే సినిమా చేసింది. ఈ సినిమా అనేక కారణాలతో విడుదల కాలేదు. ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసేందుకు నిర్మాతలు చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu