
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘టక్ జగదీష్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. ఈ సినిమాకు ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘టక్ జగదీష్’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. గత కొన్నిరోజులుగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే క్రిస్మస్ కానుకగా విడుదల చేసిన ‘టక్ జగదీష్’ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిసంచింది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 16న టక్ జగదీష్.. థియేటర్లలో విడుదల కాబోతుందని మేకర్స్ తెలిపినట్లు సమాచారం. ఉగాది పండుగ సందర్బంగా ఈ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ వార్తతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక జగపతిబాబు రావురమేష్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.













