HomeTelugu Big Storiesకరోనా పై ఉసాసన ట్వీట్‌.. అత్యంత జాగ్రత్తగా ఉండండి

కరోనా పై ఉసాసన ట్వీట్‌.. అత్యంత జాగ్రత్తగా ఉండండి

3 2
ప్రపంచ దేశాలు ‘కరోనా’ పేరు చెప్తేనే గడగడ వణుకుపోతున్నాయి. దాదాపు 70 దేశాలను ఈ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే 4000 వేల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఉపాసన కొణిదల కరోనా వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా వివరించారు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి, అపోలో ఫౌండేష్‌, అపోలో లైఫ్‌ గ్రూపుల చైర్‌పర్సన్‌ ఉపాసన వైరస్‌పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం వైరస్ సోకినా వ్యక్తి గాంధీ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె కొన్ని జాగ్రత్తలను పోస్ట్ చేశారు.

‘జలుబు, దగ్గు, జ్వరం, ఛాతీలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు భావించాలి. వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలి’ . ‘ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి మందు(మెడిసిన్‌) లేదు. మందులు వాడితే సరిపోతుందని భ్రమ పడకండి. వెంటనే ఆస్పత్రికి వెళ్లండి’. ‘హోమియోపతి ఉందని అంటున్నారు.. కానీ ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు ‘. ‘చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కులు తప్పని సరిగా వాడండి’ . ‘జంతువుల ద్వారా ఈ వైరస్‌ సోకుతుందని అంటున్నారు. కానీ ఇది ఇంత వరకూ నిర్ధారణ కాలేదు.’ . ‘మాంసం తినడం వల్ల కరోనా వైరస్‌ సోకదు. మంసాన్ని బాగా ఉడికించి తినండి’ ‘మీ పిల్లలకు కానీ, పెద్ద వారికి కానీ దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి.’ ‘ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం. ‘ఈ విషయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అంటూ ట్విట్టర్ లో ఉపాసన పోస్ట్ చేసారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu