‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి మరో బ్రేక్‌!

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించాడోగాని వరసగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఒకదాని తరువాత ఒకటిగా అడ్డంకులు కలుగుతున్నాయి. ఈ అడ్డంకుల నుంచి బయటపడేందుకు పాపం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

పూణే షూటింగ్ సమయంలో రామ్ చరణ్ కాలుకు గాయం అయ్యింది. దీంతో కొన్నిరోజు రెస్ట్ ఇచ్చారు. అనంతరం, ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో మరికొన్ని రోజులు విరామం. ఇప్పుడు మరలా మరో అవరోధం ఏర్పడింది.

వారణాసిలో బ్రహ్మాస్త్ర షూటింగ్ సమయంలో అలియా భట్ పేగుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధపడింది. వెంటనే ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన్నట్టు తెలుస్తోంది. ట్రీట్మెంట్ తరువాత బ్రహ్మాస్త్ర సినిమా, ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో జాయిన్ అవుతానాని చెప్పి రాజమౌళికి మెసేజ్ చేసింది. అసలే బ్రేక్ లతో ఇబ్బంది పడుతున్న ఆర్ఆర్ఆర్ కు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు.