మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ తన ట్విటర్ ద్వారా రాంచరణ్ నిన్న వెల్లడించాడు. రామ్ చరణ్ కరోనా బారిన పడ్డ తర్వాత కొద్ది సేపటికే వరుణ్ తేజ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మెగా కోడలు, రామ్ చరణ్ వైఫ్ ఉపాసన కొణిదెల ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.
‘ఇది కూడా వెళ్లిపోతుంది. కొత్త సంవత్సరం బాగుంటుందని ఆశిస్తున్నా. మిస్టర్ సి (చరణ్)కి ఎలాంటి లక్షణాలూ లేవు. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. నాకు నెగిటివ్ వచ్చింది. అయితే నాకు కూడా పాజిటివ్ వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ప్రస్తుతం చెర్రీతో కలిసి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నా. వేడి వేడి ద్రవాలు, ఆవిరి, విశ్రాంతి తీసుకుంటున్నామ’ని ఉపాసన పేర్కొన్నారు. ఆరు బయట చెర్రీతో కలిసి కూర్చుని ఉన్న చిన్న వీడియోను పోస్ట్ చేశారు.
This too shall pass !
Hopeful for a better 2021No symptoms & Mr C is holding strong 💪🏼
I tested NEGATIVE but there’s a huge chance of me becoming COVID positive.For now its #homequarantine
with Mr. CLoads of warm liquids, steam inhalation & rest pic.twitter.com/JMiUOcRokC
— Upasana Konidela (@upasanakonidela) December 29, 2020













