కాజల్ అదరగొట్టేసింది..!

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా సీత సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సోనూసూద్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఆర్‌ఎక్స్‌ 100 నటి పాయల్‌ రాజ్‌పుత్‌ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్‌ ఫైట్‌ చేస్తూ కనిపిస్తోంది. నాపేరు రఘురామ్‌.. సీత మా మామయ్య కూతురు. నేను సీతను చూసుకోవాలి, సీత నన్ను చూసుకోవాలని మామయ్య చెప్పారు.. అని బెల్లంకొండ శ్రీనివాస్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. కొట్టు నన్ను కొట్టు.. దమ్ముంటే కొట్టు అని కాజల్‌ అనడంతో రౌడీ ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కాజల్‌ అతడ్ని ఒక్క తన్ను తన్నడం హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమా కోసం నిజంగా ఫైట్లు చేసినట్లు కాజల్‌ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. గాయాలు కూడా అయ్యాయని
అన్నారు.