HomeTelugu Trending'ఉప్పెన' ఫస్ట్‌లుక్‌..

‘ఉప్పెన’ ఫస్ట్‌లుక్‌..

4 19
సాయి తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు. అయితే తాజాగా గురువారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్‌ మాస్‌, లవర్‌బాయ్‌ లుక్‌లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu