‘అరవింద సమేత’ న్యూ పోస్టర్‌.. త్రివిక్రమ్‌ బ్యాగ్‌ సెంటిమెంట్‌ !

ఎన్టీఆర్‌ , త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. త్రివిక్రమ్ సినిమాల్లో మనకు సర్వసాధారణంగా కొన్ని సీన్స్ కనిపిస్తుంటాయి. హీరో ఇంట్రో సీన్స్ ను లావిష్ గా చూపిస్తాడు. ప్రీ క్లైమాక్స్ లో సెంటిమెంట్ ఉంటుంది. మరొకటి బ్యాగ్ సీన్. త్రివిక్రమ్ సినిమాల్లో హీరో బ్యాగ్ పట్టుకొని ఒక చోట నుంచి మరో చోటకు ట్రావెల్ చేసే విషయాలను త్రివిక్రమ్ తన సినిమాల్లో సున్నితంగా ప్రస్తావిస్తుంటాడు. దీని వెనుక చాలాపెద్ద ఫిలాసఫీ ఉంది. మనిషి పరిణామ క్రమంలో ఒక చోట నుంచి మరొక చోటకు ప్రయాణం చేసి.. అనేక కొత్త విషయాలను కునుగొన్నాడు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే ఒకే చోట స్థబ్దతగా కూర్చోకూడదు. నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. కొత్త విషయాలను తెలుసుకుంటూనే ఉండాలి. ఒక్కోసారి ఇలాంటి ప్రయాణంలో కొన్ని అనుభవాలు ఎదురౌతుంటాయి. గతంలో తన జీవితానికి ముడిపడిన కొన్ని విషయాలు ప్రయాణంలో విడిపోతుంటాయి. అందుకే ప్రయాణాలు చేయాలి. ప్రయాణం అనగానే చేతిలో ఒక బ్యాగ్ కనిపిస్తుంది.

త్రివిక్రమ్ అతడు, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, అ..ఆ సినిమాల్లో హీరోలు బ్యాగ్ పట్టుకొని ప్రయాణాలు చేసే సీన్స్ ఉన్నాయి. త్రివిక్రమ్ కు ఈ ఫిలాసఫీ సెంటిమెంట్ గా మారింది అందుకే సినిమాల్లో ఇలాంటి సీన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ బ్యాగ్ వెనుక ఎలాంటి సెంటిమెంట్ సీన్ ఉందొ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. సునీల్‌, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.