HomeTelugu Trending'ఉప్పెన' ఓటీటీలో ఎప్పుడంటే

‘ఉప్పెన’ ఓటీటీలో ఎప్పుడంటే

Uppena OTT release date a

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12 ప్రేమికుల దినోత్సం సందర్భంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. సక్సెస్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. 2 రోజుల్లోనే ఏకంగా రూ.18 కోట్ల షేర్ వచ్చింది. రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.

కరోనా భయంతో ఇంటికే పరిమితమైన ప్రజలు సినిమాలను ఓటీటీలో చూపేందుకు మొగ్గు చూపించారు. అందుకే ఓటీటీ సంస్థలు సైతం భారీ ధరలు పెట్టి సినిమాలను కొంటున్నాయి. క్రాక్, మాస్టర్ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ప్రస్తుతం ఉప్పెన సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఉప్పెన సినిమాను ఓటీటీలో చూడాలంటే ఈ సినిమా 40 నుంచి 60 రోజుల టైమ్ గ్యాప్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా సినిమాలతో పోలీస్తే ఉప్పెన కాస్త ఆలస్యంగానే ఓటిటిలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 26 తర్వాత నుంచి ప్రారంభం కానున్నదని ఒకవైపు టాక్ వినిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!